సృష్టికి మూలం విశ్వకర్మ

సకల ప్రాణికోటిని సృష్టించు జగత్పతి విశ్వకర్మ యొక్క ఆవిర్భావం ఈ సృష్టికి పూర్వమే స్వయంభూవుగా వెలసిన రూపమే విశ్వకర్మ .అసలు విశ్వకర్మలు అంటే ఎవరు. వీరి పూర్వాపరాలు ఏమిటి ? అని పరిశీలిస్తే ! పరమాత్మ విశ్వకర్మ ఐదు ముఖాలతో,పది చేతులతో స్వయంభూగా అవతరించిన రూపం వీరిది


పుట్టుక,ఆకారం లేకుండా స్వయంభూగా వెలసిన ఈ విశ్వకర్మ భగవానుని పూజ చేయటకొరకు పంచభూతాత్మకమైన ఈ సృష్టికి ఒక ఆకారంగా ఐదు ముఖాలతో రూపాన్ని ఏర్పాటు చేసుకున్నకారణంగా ప్రతి యేట సెప్టెంబర్ 17 వ తేదీన ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ భగవానుని పండగగా విశ్వకర్మీయులు జరుపుకుంటారు.


మహాభారతంలో మయసభను నిర్మించిన దేవశిల్పి అయిన విశ్వకర్మ గురించి అందరికి తెలిసినదే అతడే విశ్వకర్మభగవానుడు అని అనుకుని సృష్టిలో అందరికన్న మొదటి వాడు ఏలా అవుతాడు అని సందేహం వెలుబుచ్చుతారు కొంత మంది.కాని ఈ మహాభారత కాలం నాటి విశ్వకర్మ వేరు,స్వయంభూగా వెలసిన విశ్వకర్మ వేరు. అదేమిటో వేదాల ఆధారంగా చూస్తే మనకు స్పస్టత వస్తుంది.