శివారాధన....

 శివారాధన....  ఈరోజు మనం మహిమాన్వితమైన శివ స్తోత్రం గురించి తెలుసుకుందాం.

కింద ఇవ్వబడింది శివ అక్షర మాలా స్తోత్రం. ఇందులో ప్రతి వాక్యం మొదట అకారాది క్షకారమ్ వరకు శివుడి వర్ణన ఉంటుంది. వీలయితే ఈ స్తోత్రాన్ని శివ సన్నిధిలో లేదా శివుణ్ణి మనసు యందు ఊహించుకుని స్తోత్రం చేసి శివానుగ్రహం పొందండి

సాంబ సదాశివ సాంబ సదాశివ  ll

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ॥
ఆనన్దామృత ఆశ్రితరక్షక ఆత్మానన్ద మహేశ శివ ॥
ఇన్దుకలాధర ఇన్ద్రాదిప్రియ సున్దరరూప సురేశ శివ ॥
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నతేశ శివ ॥
ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ ॥
ఋగ్వేదశ్రుతి మౌలి విభూషణ రవి చన్ద్రాగ్నిత్రినేత్ర శివ ॥
ౠపనామాది ప్రపఞ్చవిలక్షణ తాపనివారణ తత్వ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

ఌఙ్గస్వరూప సర్వబుధప్రియ మఙ్గలమూర్తి మహేశ శివ ॥
ౡతాధీశ్వర రూపప్రియ శివ వేదాన్తప్రియ వేద్య శివ ॥
ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగిహృదిప్రియవాస శివ ॥
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానన్త మహేశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

ఓఙ్కారప్రియ ఉరగవిభూషణ హ్రీంఙ్కారాది మహేశ శివ ॥
ఔరసలాలిత అన్తకనాశన గౌరిసమేత గిరీశ శివ ॥
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ॥
ఆహారప్రియ ఆది గిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాన్తి శివ ॥
ఖడ్గశూల మృగ ఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశ శివ ॥
గంగా గిరిసుత వల్లభ గుణహిత శఙ్కర సర్వజనేశ శివ ॥
ఘాతకభంజన పాతకనాశన గౌరి సమేత గిరీశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

ఙఙాశ్రిత శ్రుతి మౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశ శివ ॥
చణ్డవినాశన సకలజనప్రియ మణ్డలాధీశ మహేశ శివ ॥
ఛత్రకిరీట సుకుణ్డల శోభిత పుత్రప్రియ భువనేశ శివ ॥
జన్మజరా మృతి నాశన కల్మష రహిత తాప వినాశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

ఝఙ్కారప్రియ భృంగిరిటప్రియ ఓఙ్కారేశ మహేశ శివ ॥
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ ॥
టఙ్కాద్యాయుధ ధారణ సత్వర హ్రీఙ్కారాది సురేశ శివ ॥
ఠఙ్క స్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

డంభవినాశన డిణ్డిమభూషణ అంబరవాస చిదీశ శివ ॥
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ ॥
నళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ ॥
తత్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానన్ద మహేశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

స్థావరజంగమ భువనవిలక్షణ భావుక మునివర సేవ్య శివ ॥
దుఖః వినాశన దళితమనోన్మన చన్దన లేపిత చరణ శివ ॥
ధరణీధరశుభ ధవళవిభాస్వర ధనదాదిప్రియ దాన శివ ॥
నానామణిగణ భూషణనిర్గుణ నటనజనప్రియ నాట్య శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

పన్నగభూషణ పార్వతినాయక పరమానన్ద పరేశ శివ ॥
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ ॥
బన్ధవినాశన బృహతీశామర స్కన్దాదిప్రియ కనక శివ ॥
భస్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

మన్మథనాశన మధుపానప్రియ సున్దరపర్వతవాస శివ ॥
యతిజన హృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశ శివ ॥
రామేశ్వర రమణీయముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ ॥
లఙ్కాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ ॥
శాన్తి స్వరూప జగత్రయ చిన్మయ కాన్తిమతీ ప్రియ కనక శివ ॥
షణ్ముఖజనక సురేన్ద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ ॥
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుహృది ప్రియవాస శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥

హరపురుషోత్తమ అద్వైతామృత పూర్ణ మురారి సుసేవ్య శివ ॥
ళాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ ॥
క్షరరూపాది ప్రియాన్విత సున్దర సాక్షి జగత్రయ స్వామి శివ ॥
త్రిపురాసుర హర ఙ్ఞానప్రదాయక త్రిగుణాతీత మహేశ శివ ॥

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ॥
సాంబ సదాశివ సాంబ శివ ॥